Malaika Arora: రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలీవుడ్ నటి మలైకా అరోరా.. అపోలో ఆసుపత్రికి తరలింపు

Actor Malaika Arora Injured In Car Accident Admitted To Hospital
  • పూణెలోని ఓ ఫ్యాషన్ ఈవెంట్‌లో పాల్గొన్న మలైకా
  • తిరిగి వస్తుండగా ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రమాదం
  • కారులో తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చిన ఎంఎన్ఎస్ నేత
బాలీవుడ్ ప్రముఖ నటి, మోడల్ మలైకా అరోరా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. పూణెలోని ఓ ఫ్యాషన్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె నిన్న మధ్యాహ్నం తిరిగి ఢిల్లీ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె నుదిటిపై స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే నవీ ముంబైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. మలైకా నుదిటిపై స్వల్పంగా గాయాలయ్యాయని, సీటీ స్కాన్‌లో అంతా బాగానే ఉందని అపోలో వైద్యులు తెలిపారు. నేడు (ఆదివారం) ఆమెను డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు. 

పూణె నుంచి వస్తున్న  సమయంలో ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ హైవేపై ఖలాల్‌పూర్ టోల్ ప్లాజా సమీపంలో మూడుకార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలోనే ఆమె గాయపడినట్టు తెలుస్తోంది. మలైకా ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె సోదరి అమృతా అరోరా తెలిపారు. ప్రమాద సమయంలో కారును డ్రైవర్ నడుపుతుండగా, ఆమెతోపాటు బాడీగార్డ్ కూడా ఉన్నాడు. కాగా, అదే సమయంలో అదే దారిలో వస్తున్న ఎంఎన్ఎస్ నేత ఒకరు మలైకాను ఆసుపత్రికి తరలించినట్టు అధికారి ఒకరు తెలిపారు.
Malaika Arora
Car Accident
Bollywood
Pune
Apollo Hospital

More Telugu News