Uber: ఇంధ‌న ధ‌ర‌ల దెబ్బ‌.. 15 శాతం రేట్ల‌ను పెంచేసిన ఉబెర్‌

uber hikes its fares 15 percent in mumbai
షార్ట్స్‌లో చూడండి
ఉక్రెయిన్, ర‌ష్యాల మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం నేప‌థ్యంలో అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డం, దాని ఆధారంగా దేశంలో ఇంధ‌న ధ‌ర‌లు పెరిగిపోతున్నాయి. ఈ ఫ‌లితంగా నిత్యావ‌స‌ర ధ‌ర‌లూ ఆకాశాన్నంటే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో క్యాబ్ సేవ‌ల్లో ప్ర‌ముఖ సంస్థ‌గా పేరొందిన ఉబెర్ త‌న రేట్ల‌ను పెంచేసింది. ప్ర‌స్తుతం ఉన్న ధ‌ర‌ల‌కు అద‌నంగా 15 శాతాన్ని జోడిస్తున్న‌ట్లుగా ఆ సంస్థ పేర్కొంది.

అయితే ఈ పెరిగిన ధ‌ర‌లు ముంబైకి మాత్ర‌మేన‌ని ఉబెర్ తెలిపింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌కు అనుగుణంగానే త‌మ సేవ‌ల రేట్ల‌ను పెంచుతున్న‌ట్లుగా ఉబెర్ ప్ర‌క‌టించింది. ఉబెర్ ప్ర‌క‌ట‌న చూస్తుంటే.. త్వ‌ర‌లోనే ఈ పెంచిన రేట్ల‌ను దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేసేందుకు ఆ సంస్థ ఏమాత్రం వెనుకంజ వేయ‌ద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.
Go Back to Shorts
Uber
Fuel Charges Hike
Mumbai

More Telugu News