Chennai Super Kings: ఐపీఎల్ లో నేడు చెన్నై వర్సెస్ లక్నో... ఊతప్ప దూకుడు

Chennai Super Kings takes on Lucknow Supergiants in Mumbai

  • ఆసక్తికరంగా సాగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో జట్టు
  • వేగంగా ఆడుతున్న ఊతప్ప

ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుండడంతో అభిమానులు విశేషంగా ఆస్వాదిస్తున్నారు. ఇవాళ ముంబయి బ్రాబౌర్న్ స్నేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుంది. 

బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టుకు ఓపెనర్ రాబిన్ ఊతప్ప దూకుడైన ఆరంభం అందించాడు. అవేష్ ఖాన్ విసిరిన తొలి ఓవర్లో 2 ఫోర్లు కొట్టాడు. మరుసటి ఓవర్లో ఓ భారీ సిక్స్, ఫోర్ బాదాడు. ప్రస్తుతం 2 ఓవర్లు ముగిసేసరికి చెన్నై వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప (20 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్ (1 నాటౌట్) ఉన్నారు.

Chennai Super Kings
Lucknow Supergiants
Mumbai
Robin Uthappa
  • Loading...

More Telugu News