Sonu Sood: సోనూ సూద్ సోదరి ఓటమి

Sonu Sood sister Malvika Sood lost in Punjab elections

  • పంజాబ్ లో వార్ వన్ సైడ్
  • ఆప్ అభ్యర్థుల చేతిలో ప్రత్యర్థుల చిత్తు
  • మోగా నియోజకవర్గంలో మాళవిక సూద్ ఓటమి 

పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వెలువడిన కౌంటింగ్ ట్రెండ్స్ ప్రకారం ఆప్ అభ్యర్థుల చేతుల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు చావుదెబ్బ తింటున్నారు. ఆప్ దెబ్బకు పెద్దపెద్ద రాజకీయ నాయకులు సైతం ఓటమిపాలవుతున్నారు. 

మరోవైపు ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ ఓడిపోయారు. మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె... ఆప్ అభ్యర్థి డాక్టర్ అమన్ దీప్ కౌర్ అరోరా చేతిలో పరాజయం పొందారు. అమన్ దీప్ కు 58,813 ఓట్లు రాగా, మాళవికకు 38,125 ఓట్లు వచ్చాయి.

Sonu Sood
Sister
Malvika Sood
Punjab
Elections
  • Loading...

More Telugu News