Mukul Arya: పాలస్తీనాలో భారత రాయబారి ముకుల్ ఆర్య అనుమానాస్పద మృతి.. ఎంబసీలోనే విగతజీవిగా..!

Mukul Arya Indias Palestine Envoy Found Dead At Indian Mission

  • ముకుల్ ఆర్య 2008 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి
  • తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్న కేంద్ర మంత్రి జయశంకర్
  • పలు దేశాలకు భారత రాయబారిగా పనిచేసిన ముకుల్

పాలస్తీనాలో భారత రాయబారి ముకుల్ ఆర్య అనుమానాస్పదస్థితిలో మరణించారు. రమల్లాలోని భారత రాయబార కార్యాలయంలోనే ఆయన విగత జీవిగా కనిపించారు. ఇండియన్ ఫారిన్ సర్వీసెస్‌ 2008 బ్యాచ్‌కు చెందిన ముకుల్ ఆర్య ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రం చదువుకున్నారు. ఆ తర్వాత ఇండియన్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారు. కాబూల్, మాస్కోల్లోని భారత రాయబార కార్యాలయాలతోపాటు ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యాలయంలోనూ పనిచేశారు. పారిస్‌లోని యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి బృందంలోనూ పనిచేశారు.

ముకుల్ ఆర్య మృతి విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జయశంకర్ ధ్రువీకరించారు. ఆయన మృతి తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముకుల్ మృతి వార్త తెలిసిన వెంటనే పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ప్రధాని మహమ్మద్ ష్టాయే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముకుల్ భౌతిక కాయాన్ని తరలించేందుకు భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది.

Mukul Arya
Ramallah
Palestine
Envoy
  • Loading...

More Telugu News