IPL: కోహ్లీకి జోడీ అతడే.. ఆర్సీబీ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

Faf May Open Innings With Kohli RCBs Interesting Update

  • కోహ్లీ, డూప్లెసిస్ జోడీ ఫొటో విడుదల
  • ఆర్సీబీ జెర్సీలో స్టార్ ప్లేయర్లు
  • భవిష్యత్ చిత్రం అంటూ కామెంట్ 

టీమిండియా సహా అన్ని రకాల ఫార్మాట్ల నుంచి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ గత ఏడాది తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సారథ్య బాధ్యతల నుంచీ తప్పుకొంటున్నట్టు అతడు ప్రకటించేశాడు. దీంతో ఇప్పుడు ఆ జట్టు పగ్గాలను ఎవరు అందుకుంటారా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు కోహ్లీకి ఓపెనర్ జోడీ ఎవరన్నదానిపై చర్చ నడుస్తోంది. 

కెప్టెన్ చర్చ వచ్చినప్పుడు మొన్నటిదాకా బాగా వినిపించిన పేరు గ్లెన్ మాక్స్ వెల్. అయితే, ఇప్పుడు వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ వదిలేసుకున్న దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఫాఫ్ డూప్లెసిస్ ను రూ.7 కోట్లకు బెంగళూరు సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు అతడూ రేసులో ఉన్నట్టయింది. 

మరోవైపు కోహ్లీకి ఓపెనర్ గా కూడా జోడీ అతడేనంటూ ప్రచారం నడుస్తోంది. ఈ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఆర్సీబీ యాజమాన్యం ఓ ఫొటోను ట్వీట్ చేసింది. కోహ్లీ, డూప్లెసిస్ లు ఆర్సీబీ జెర్సీలో కలిసి ఆడుతున్నట్టున్న ఫొటోను పోస్ట్ చేసింది. 

‘‘భవిష్యత్ చిత్రం. ఈ ఇద్దరు కలిసి ఆడితే ఎలా ఉంటుందో  చూసేందుకు తహతహలాడుతున్నారా, ఫ్యాన్స్!’’ అంటూ ఆర్సీబీ ట్వీట్ చేసింది. ఈ ఫొటోకు చెన్నై సూపర్ కింగ్స్ రిప్లై ఇచ్చింది. పోరాటానికి సిద్ధమంటూ పేర్కొంది.

IPL
Virat Kohli
Cricket
Royal Challengers Bangalore
  • Loading...

More Telugu News