Shriya Saran: ఆసుపత్రిలో శ్రియ భర్త.. వైరల్ అవుతున్న ఫొటో!

Actress Shriya Saran husband admitted in hospital

  • కొంత కాలంగా హెర్నియాతో బాధపడుతున్న శ్రియ భర్త
  • అపోలో ఆసుపత్రిలో ఆపరేషన్
  • ఉపాసన, డాక్టర్ రజనీశ్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన శ్రియ

టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు అగ్రతారల్లో ఒకరిగా వెలుగొందిన శ్రియ కొన్నేళ్ల క్రితం ఆండ్రీ కొశ్చీవ్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇటీవలే శ్రియ ఒక బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారికి 'రాధ' అని పేరు పెట్టుకుంది. ఎప్పుడూ భర్తతో సంతోషంగా గడిపే ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే శ్రియ... తాజాగా కొంత బాధాకరమైన పోస్టును షేర్ చేసింది. తన భర్త ఆసుపత్రిలో ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకుంది. 

గత కొంత కాలంగా శ్రియ భర్త హెర్నియాతో బాధ పడుతున్నాడట. దీంతో, ఇటీవల హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యాడు. ఆయనకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఇప్పుడు ఆయన పరిస్థితి బాగుందని శ్రియ తెలిపింది. అనారోగ్యంతో ఉన్నప్పుడు రాధను కూడా ఎత్తుకోలేని స్థితిలో ఉండేవాడని, ఇప్పుడు ఆయన బాగున్నాడని చెప్పింది. దీని కోసం సాయపడిన అపోలో ఆసుపత్రి మేనేజ్ మెంట్ కు, ఉపాసన కొణిదెలకు, డాక్టర్ రజనీశ్ రెడ్డికి కృతజ్ఞతలు చెపుతున్నానని అన్నారు. తన భర్త ఆసుపత్రిలో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.

Shriya Saran
Husband
Hospital
Tollywood
  • Loading...

More Telugu News