Chandrababu: ఉక్రెయిన్‌లో ఉన్న 1,481 మంది ఏపీ విద్యార్థుల‌ వివ‌రాల‌తో జైశంక‌ర్‌కు చంద్ర‌బాబు లేఖ‌

chandrababu writes letter to jaishankar

  • ఉక్రెయిన్‌-ర‌ష్యా మ‌ధ్య యుద్ధం 
  • ఉక్రెయిన్‌లో చిక్కుకున్న‌ ఏపీ విద్యార్థులు 
  • ఏపీ విద్యార్థులకు సాయం చేయాలని విన‌తి

ఉక్రెయిన్‌-ర‌ష్యా మ‌ధ్య యుద్ధం జ‌రుగుతుండ‌డంతో ఉక్రెయిన్‌లో ఏపీ విద్యార్థులు చిక్కుకుపోయిన విష‌యం తెలిసిందే. దీనిపై కేంద్ర విదేశాంగ‌ మంత్రి జైశంకర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులకు సాయం చేయాలని ఆయ‌న కోరారు. 

లేఖ‌లో 1,481 మంది వివరాలను జైశంక‌ర్‌కు చంద్రబాబు పంపారు. ప్రస్తుతం బుకారెస్ట్, బుడాపెస్ట్ నుంచే విద్యార్థులను అధికారులు తరలిస్తున్నార‌ని ఆయ‌న గుర్తు చేశారు. స్లోవాకియా, మల్దోవ్స్, పోలాండ్‌ల నుంచి కూడా ప్రత్యేక విమానాలు నడిపి విద్యార్థులను తీసుకురావాలని ఆయ‌న విజ్ఞప్తి చేశారు.

Chandrababu
Telugudesam
jai shankar
  • Loading...

More Telugu News