Kacha Badam: కారు ప్రమాదంలో గాయపడిన ‘కచ్చాబాదమ్’ సింగర్

Kacha Badam singer Bhuban Badyakar hospitalised after car accident
  • ‘కచ్చా బాదమ్’ పాటతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిన వైనం
  • కొనుగోలు చేసిన సెకండ్ హ్యాండ్ కారును నేర్చుకుంటుండగా ప్రమాదం
  • చాతీకి స్వల్పంగా గాయాలు 
‘కచ్చా బాదమ్’ పాటతో రాత్రికి రాత్రే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న భుబన్ బద్యాకర్ పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌లో నిన్న ఓ ప్రమాదంలో గాయపడ్డాడు. ఇటీవల తాను కొనుగోలు చేసిన సెకండ్ హ్యాండ్ కారును నేర్చుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అతడి చాతీకి స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం సూరి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

‘కచ్చా బాదమ్’ పాట సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత  భుబన్ బద్యాకర్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. బీర్భూమ్ జిల్లాలో పల్లీలు అమ్ముకునే భుబన్ కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఈ  పాటను కంపోజ్ చేసి పాడేవాడు. ఆ తర్వాత ఆ పాటను రీమిక్స్ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే 50 మిలియన్ వీక్షణలు వచ్చాయి. 

రాత్రికి రాత్రే ఓవర్ నైట్ స్టార్ కావడానికి ముందు రోజు వరకు మూడు నాలుగు కిలోల పల్లీలు అమ్ముకునే వాడు. తద్వారా రోజుకు రూ.200-250 సంపాదించేవాడు. పేరు ప్రఖ్యాతులు సొంతమైన తర్వాత ఇకపై పల్లీలు అమ్మబోనని చెప్పాడు. కాగా, భువన్ బద్యాకర్‌ను ఇటీవల పశ్చిమ బెంగాల్ పోలీసులు సత్కరించారు.
Kacha Badam
Bhuban Badyakar
Road Accident
West Bengal

More Telugu News