Nama Nageswararao: తెలంగాణపై కక్షతోనే కేంద్రం సహకరించడంలేదు: నామా నాగేశ్వరరావు

Nama Nageswararao fires on union govt
  • కేంద్రంపై ధ్వజమెత్తిన నామా
  • రహదారుల నిర్మాణానికి డబ్బులు అడుగుతోందని ఆరోపణ
  • కిషన్ రెడ్డి చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణపై కక్షతోనే కేంద్రం సహకరించడంలేదని ఆరోపించారు. తెలంగాణ అంటే కేంద్రానికి ఎందుకంత చిన్నచూపు? అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం రాష్ట్రం నుంచి డబ్బులు అడుగుతోందని మండిపడ్డారు. రీజనల్ రింగ్ రోడ్డుపైనా కేంద్రం మెలికలు పెట్టిందని అన్నారు. నీతి ఆయోగ్ వంటి సంస్థల ఫిర్యాదులను కూడా కేంద్రం విస్మరిస్తోందని తెలిపారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. రాష్ట్ర అవసరాల కోసం కిషన్ రెడ్డి ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు.

తాము తెలంగాణ కోసం పార్లమెంటులో మాట్లాడుతుంటే అడ్డుకున్నారని నామా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం, బయ్యారం ప్రాంతాల్లో ఖనిజ సంపద ఉందని, తెలంగాణకు ప్రాజెక్టులు తీసుకొస్తే దండ వేసి దండం పెడతానని అన్నారు.

  • Loading...

More Telugu News