CM Jagan: డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె పెళ్లి వేడుకకు హాజరైన సీఎం జగన్

CM Jagan attends Dy CM Amzad Basha daughter wedding in Kadapa
షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం జగన్ కడప జిల్లా పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి తన ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పెళ్లి వేడుకకు హాజరైన అనంతరం సీఎం జగన్ గన్నవరం బయల్దేరారు.
అంతకుముందు, కడప జిల్లా పర్యటనలో భాగంగా పుష్పగిరిలో విట్రియో రెటీనా ఐ ఇన్ స్టిట్యూట్ ను ప్రారంభించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్, 150 పడకల వార్డును, ఆసుపత్రిలోని ఇతర విభాగాలను పరిశీలించారు.
Go Back to Shorts
CM Jagan
Kadapa District
Amzad Basha
Daughter Wedding
Eye Institute

More Telugu News