Kiran Abbavaram: మార్చి 4న వస్తున్న కిరణ్‌ అబ్బవరం ‘సెబాస్టియన్‌ పి.సి524’

Kiran Abbavaram new movie Sebastian set release in March first week

  • హ్యాట్రిక్ కు రెడీ అవుతున్న కిరణ్ అబ్బవరం
  • బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో 'సెబాస్టియన్ పి.సి524'
  • రిలీజ్ డేట్ ప్రకటించిన నిర్మాతలు
  • రేచీకటి కాన్సెప్టుతో చిత్రం

‘రాజావారు రాణిగారు’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన కిరణ్‌ అబ్బవరం టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన రెండో చిత్రం ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం’తో కూడా మరో సాలిడ్‌ సక్సెస్‌ అందుకున్న ఈ యువ హీరో... క్లాసు-మాసు, యూత్‌- ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ‘సెబాస్టియన్‌ పి.సి524’తో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం మార్చి 4న విడుదల కానుంది. ఈ మేరకు చిత్రబృందం ప్రకటన చేసింది.

జ్యోవిత సినిమాస్‌ పతాకంపై ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లుగా ఈ చిత్రం తెరకెక్కింది. సెబాస్టియన్ చిత్రానికి సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్‌ నిర్మాతలు కాగా... బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ విడుదల చేస్తోంది.

రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘రాజావారు రాణిగారు’, ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం’ చిత్రాల విజయంతో దూసుకుపోతున్న కిరణ్‌ అబ్బవరంకు ‘సెబాస్టియన్‌ పి.సి524’ కచ్చితంగా హ్యాట్రిక్‌ హిట్‌ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జిబ్రాన్‌ సంగీతం దర్శకత్వంలో పాటలన్నీ అద్భుతంగా వచ్చాయని తెలిపారు. ముఖ్యంగా "హెలి"అనే పాటకు ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవలే విడుదలైన గ్లింప్స్ కూడా సూపర్ ట్రెండింగ్ లో ఉందని తెలిపారు. ఆదిత్యా మ్యూజిక్‌ ద్వారా విడుదలైన ఆడియోకు అద్భుతమైన స్పందన వస్తోందని వివరించారు.

కాగా, 'సెబాస్టియన్ పి.సి524' రేచీకటి కాన్సెప్టుతో తెరకెక్కింది. రేచీకటి గల హీరోకి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం వస్తుంది. అతడు నైట్‌ టైం డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది ఈ సినిమా కథాంశం.

Kiran Abbavaram
Sebastian PC524
Release
Tollywood
  • Loading...

More Telugu News