TSRTC: బీరు సీసా పేలి.. ఆర్టీసీ డ్రైవర్ కు తీవ్రగాయాలు

RTC driver injured after beer bottle blasts

  • ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఘటన
  • డ్యూటీ ముగిసిన తర్వాత బీరు కొనుగొలు చేసి, బొడ్లో పెట్టుకున్న డ్రైవర్
  • బీరు పేలడంతో పొట్టనుంచి బయటకు వచ్చిన పేగులు

బీరు సీసా పేలడంతో టీఎస్ఆర్టీసీ డ్రైవర్ తీవ్రంగా గాయపడిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో జరిగింది. నిన్న సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులను తాడ్వాయికి తరలించిన తర్వాత బస్సును బస్టాప్ లో ఆపాడు డ్రైవర్. అనంతరం పక్కన ఉన్న వైన్ షాపులో బీరు కొనుగోలు చేసి బొడ్లో పెట్టుకుని వెళ్తుండగా బాటిల్ పేలిపోయింది.

దీంతో, ఆయన పొట్ట భాగంలోకి గాజు ముక్కలు దూసుకుపోయి, పేగులు బయటకు వచ్చాయి. సహచర డ్రైవర్లు అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో హైదరాబాదుకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.

TSRTC
Driver
Beer Bottle
Blast
  • Loading...

More Telugu News