Ayyanna Patrudu: విద్యుత్ కోతలు ఎక్కడున్నాయి అని దబాయించిన హవాలా మంత్రి గారికి వాస్తవం తెలిసినట్టుంది: అయ్యన్నపాత్రుడు

Ayyanna Patrudu slams AP minister Balineni Srinivasa Reddy

  • ఏపీలో విద్యుత్ కోతలు
  • స్పందించిన అయ్యన్న
  • విద్యుత్ శాఖపై దృష్టి పెట్టాలని మంత్రి బాలినేనికి హితవు
  • చంద్రబాబుపై ఏడుపులు ఎందుకంటూ ట్వీట్

ఏపీలో విద్యుత్ కోతలపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ధ్వజమెత్తారు. అసలు విద్యుత్ కోతలు ఎక్కుడున్నాయి? అని రెండు రోజుల కిందట దబాయించిన హవాలా మంత్రి గారికి ఇప్పుడు వాస్తవం తెలిసి వచ్చినట్టుందని విమర్శించారు. అక్కడక్కడ విద్యుత్ కోతలు ఉన్నాయని అంగీకరిస్తున్నారని అన్నారు.

రష్యా, శ్రీలంక పేకాటల మీద, హవాలా మీద పెట్టే శ్రద్ధ కొంచెం మీ శాఖపైనా పెట్టండి... రాష్ట్రం మొత్తం విద్యుత్ కోతలు ఉన్నాయో లేదో తెలుస్తుంది అని హితవు పలికారు. "మీకు పేకాటలో డబ్బులు పోతే కూడా దానికి చంద్రబాబే కారణం అనేలా ఉన్నారు. జగన్ అసమర్థుడు అని ఒప్పుకోకుండా ఇంకా చంద్రబాబుపై ఏడుపులు ఎందుకు?" అంటూ అయ్యన్న ట్వీట్ చేశారు.

Ayyanna Patrudu
Balineni Srinivasa Reddy
Power Cuts
Andhra Pradesh
  • Loading...

More Telugu News