Pawan Kalyan: ఈ నెల 21 నుంచి జనసేన సభ్యత్వ నమోదు... విజయవంతం చేయాలన్న పవన్ కల్యాణ్

Pawan Kalyan announce party active membership program

  • పార్టీ క్షేత్రస్థాయి పటిష్ఠత కోసం పవన్ చర్యలు
  • మరోసారి క్రియాశీలక సభ్యత్వాల నమోదు
  • ప్రకటన చేసిన పవన్ కల్యాణ్

క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయడంపై ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. దీనిపై నేడు ప్రకటన విడుదల చేశారు. క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జనసేన పార్టీ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని తెలిపారు. ఈ నెల 21 నుంచి సభ్యత్వాల నమోదు షురూ అవుతుందని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నేత, జనసైనికులు, వీరమహిళలు పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

2020 సంవత్సరం సెప్టెంబరు మాసంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించినట్టు తెలిపారు. లక్షమందికి పైగా పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారని వివరించారు. ప్రమాదాలకు గురవుతున్న యువ జనసైనికుల కోసం బీమా సౌకర్యం కూడా తీసుకువచ్చామని, ఈ బీమా పథకం ప్రీమియం కోసం రూ.1 కోటి మేర నిధిని అందజేసినట్టు పవన్ వెల్లడించారు.

Pawan Kalyan
Party Membership
Janasena
Andhra Pradesh
  • Loading...

More Telugu News