Andhra Pradesh: ఏపీ విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ

Special PRC For AP Electricity Employees
  • కమిషన్ ను నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు
  • చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్
  • వేతనం, అలవెన్సుల సవరణపై అధ్యయనం
ఏపీ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రత్యేక పీఆర్సీని ఏర్పాటు చేసింది. ఏపీ జెన్ కో, ట్రాన్స్ కో, డిస్కం ఉద్యోగులకు ప్రత్యేక వేతన సవరణ కమిషన్ ను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ ను చైర్మన్ గా నియమించింది. ఉద్యోగుల వేతనాలు, అలవెన్సుల సవరణపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

కాగా, పీఆర్సీపై ఇప్పటికే ఉద్యోగులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త పీఆర్సీతో నష్టపోతున్నామని, పాత జీతం కన్నా తక్కువ వస్తోందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రుల కమిటీతో నిన్న జరిగిన సమావేశం కూడా సత్ఫలితాలనివ్వలేదు.
Andhra Pradesh
PRC
Electricity Employees

More Telugu News