IPL: ఐపీఎల్ వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితా విడుదల

IPL announces players list who will be in auction
  • ఈ వేసవిలో ఐపీఎల్ 15వ సీజన్
  • ఫిబ్రవరి 12, 13 తేదీల్లో వేలం
  • బెంగళూరు వేదికగా వేలం
  • మొత్తం 590 మంది ఆటగాళ్లతో వేలం జాబితా

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-15 వేలం జరగనుంది. తాజా సీజన్ కోసం ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం ప్రక్రియను నిర్వహించేందుకు ఐపీఎల్ పాలకమండలి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. ఈసారి వేలానికి 590 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉంటారు.

ఈ వేలంలో శ్రేయాస్ అయ్యర్, శిఖర్ ధావన్, మహ్మద్ షమీ, ప్యాట్ కమ్మిన్స్, ఫాఫ్ డుప్లెసిస్, డేవిడ్ వార్నర్, కగిసో రబాడా, ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, క్వింటన్ డికాక్ లకు గిరాకీ ఉండొచ్చని ఐపీఎల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  • Loading...

More Telugu News