APSRTC: విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ! 

APSRTC announces discount for Vijayawad to Bengaluru going passengers

  • టికెట్ ధరపై 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించిన అధికారులు
  • వెన్నెల, అమరావతి బస్సు సర్వీసులకు రాయితీ వర్తింపు
  • ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరిన అధికారులు

విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రెండు నగరాల మధ్య నడిచే వెన్నెల, అమరావతి బస్సు సర్వీసుల్లో టికెట్ ధరపై 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ బస్సులు గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి. ఈ నేపథ్యంలో ఆయా స్టేషన్లలో ఎక్కే ప్రయాణికులకు కూడా ఈ రాయితీ వర్తిస్తుంది.

అయితే శుక్రవారం బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చే సర్వీసులు, ఆదివారం విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లే సర్వీసుల్లో మాత్రం సాధారణ ఛార్జీలను వసూలు చేస్తారు. రాయితీ కారణంగా విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లే వెన్నెల స్లీపర్ టికెట్ ధర రూ. 1,490కి, అమరావతి సర్వీస్ టికెట్ ఛార్జీ రూ. 1,365కి తగ్గింది. ఈ సదుపాయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

APSRTC
Vijayawada
Bengaluru
Discount
  • Loading...

More Telugu News