Team India: తొలి వన్డే... ఇండియా ముందు భారీ టార్గెట్ పెట్టిన సౌతాఫ్రికా

South Africa sets 297 runs target before India in first ODI

  • 4 వికెట్లకు 296 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా
  • సెంచరీలతో కదం తొక్కిన బవుమా, డుస్సేన్
  • బుమ్రాకు 2, అశ్విన్ కు ఒక వికెట్

ఇండియాతో జరుగుతున్న తొలి వన్దేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా భారీ స్కోరును సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులను సాధించింది. బవుమా (110 పరుగులు, 143 బంతులు, 8 ఫోర్లు), డుస్సేన్ (129 పరుగులు, 96 బంతులు, 9 ఫోర్లు, 4 సిక్సర్లు.. నాటౌట్) భారత బౌలర్లను చితకబాదడంతో సఫారీల స్కోరు బోర్డు దూసుకుపోయింది.

దక్షిణాఫ్రికా ఇతర బ్యాట్స్ మెన్లలో డీకాక్ (27), మలాన్ (6), మార్క్ రామ్ (4), మిల్లర్ (2) పరుగులు చేశారు. ఎక్స్ ట్రాల రూపంలో 18 పరుగులు వచ్చాయి. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీయగా, అశ్విన్ ఒక వికెట్ తీశాడు. మార్క్ రామ్ రనౌట్ అయ్యాడు. డుస్సేన్, మిల్లర్ నాటౌట్ గా నిలిచారు. 297 పరుగుల లక్ష్యంతో టీమిండియా కాసేపట్లో బ్యాటింగ్ కు దిగనుంది.

Team India
South Africa
First ODI
Score
  • Loading...

More Telugu News