Revanth Reddy: వీరందరికీ రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తాం: రేవంత్ రెడ్డి

We will falicitate with rahul says Revanth Reddy
  • 30 లక్షల సభ్యత్వాలను లక్ష్యంగా పెట్టుకున్నాం
  • సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 2 లక్షల ప్రమాద బీమా
  • మండల స్థాయిలో 10 వేల సభ్యత్వాలు చేయిస్తే రాహుల్ తో సన్మానం చేయిస్తాం
తెలంగాణలో 30 లక్షల పార్టీ సభ్యత్వాలను చేయించి తీరుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సభ్యత్వాలను చేయించడానికి జనవరి 26 వరకు గడువు పెట్టుకున్నామని... అయితే కరోనా నేపథ్యంలో గడువును పెంచామని తెలిపారు. ఇప్పటి వరకు 7 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని చెప్పారు. ప్రతి బూత్ నుంచి 100 మంది సభ్యత్వాలను నమోదు చేయించడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని అన్నారు.
 
సభ్యత్వం తీసుకున్న వారికి రూ. 2 లక్షల ప్రమాద బీమాను అందిస్తామని చెప్పారు. దీని కోసం న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తకు ప్రమాదంలో మరణం సంభవిస్తే రూ. 2 లక్షల పరిహారం అందుతుందని, గాయపడితే ప్రమాదం తీవ్రతను బట్టి పరిహారం లభిస్తుందని చెప్పారు. మండల స్థాయిలో 10 వేలు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 50 వేలు, పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో 3.5 లక్షల సభ్యత్వాలను చేయించిన వారికి రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తామని తెలిపారు.
Revanth Reddy
Congress
Rahul Gandhi
Membership

More Telugu News