టీనేజర్లకు టీకాలో పొరపాటు.. కొవాగ్జిన్‌కు బదులు కొవిషీల్డ్ వేసిన బీహార్ సిబ్బంది
- దేశవ్యాప్తంగా చురుగ్గా వ్యాక్సినేషన్ కార్యక్రమం
- నలంద జిల్లాలో వ్యాక్సినేషన్ సిబ్బంది నిర్లక్ష్యం
- కొవిషీల్డ్ వేసి కొవాగ్జిన్ వేసినట్టుగా ధ్రువీకరణ పత్రం
- సిబ్బందిపై ఉన్నతాధికారుల వేటు
అయితే, తమకు ఇచ్చింది కొవాగ్జిన్ కాదని, కొవిషీల్డ్ అని గుర్తించిన వారు విషయాన్ని తండ్రి ప్రియరంజన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సిబ్బందిని నిలదీశారు. కుమారులకు కొవిషీల్డ్ టీకా ఇచ్చినప్పటికీ ధ్రువీకరణ పత్రంలో మాత్రం కొవాగ్జిన్‌గానే పేర్కొనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిని తీవ్రమైన పొరపాటుగా పరిగణించిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని సస్పెండ్ చేశారు.