Vangaveeti Radha: వంగవీటి రాధా హత్యకు రెక్కీ జరిగినట్టు ఆధారాలు లేవు.. చంద్రబాబువి నిరాధార ఆరోపణలు: విజయవాడ పోలీస్ కమిషనర్

No primary evidences on rekkie on Vangaveeti Radha says Vijayawada CP

  • ఈ అంశంపై లోతుగా విచారణ జరిపాం
  • ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి గన్ మెన్లను ఏర్పాటు చేసింది
  • రాధా భద్రత గురించి ఎవరూ ఆందోళన చెందొద్దు

తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారంటూ టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో విజయవాడ పోలీస్ కమిషన్ కాంతి రాణా మాట్లాడుతూ రెక్కీ జరిగినట్టు ఆధారాలు లభించలేదని అన్నారు.

విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనపై సమగ్రంగా, లోతుగా విచారణ జరిపామని తెలిపారు. విజయవాడ పోలీసులతో పాటు ఇతర దర్యాప్తు ఏజెన్సీలు కూడా రెక్కీపై దర్యాప్తు చేశాయని చెప్పారు. అయితే రెక్కీ నిర్వహించినట్టు ఇంత వరకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లభించలేదని తెలిపారు.

ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కూడా  వెంటనే స్పందించిందని... రాధాకు గన్ మెన్లను ఏర్పాటు చేసిందని చెప్పారు. విజయవాడ పోలీసులు కూడా రాధా భద్రత కోసం అన్ని చర్యలను తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఆయన భద్రత గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... అది పూర్తిగా తమ బాధ్యత అని చెప్పారు. పోలీసు డిపార్ట్ మెంట్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేశారని... అవి కరెక్ట్ కాదని తెలిపారు.

Vangaveeti Radha
Chandrababu
Telugudesam
Vijayawada Police Commissioner
  • Loading...

More Telugu News