Amma Odi: 'అమ్మఒడి' సినిమాలో నటిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే

YSRCP MLA Chetti  Phalguna acting in Amma Odi film
  • పాడేరులో షూటింగ్ జరుపుకుంటున్న అమ్మఒడి సినిమా
  • సినిమాలో ఉపాధ్యాయుడి పాత్రను పోషిస్తున్న ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ
  • అమ్మఒడి పథకంపై సినిమా తీస్తుండటం సంతోషంగా ఉందన్న ఫాల్గుణ
వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో 'అమ్మఒడి' పథకం ఒకటి. తాజాగా ఈ పథకాన్ని ఆధారంగా చేసుకుని టాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. 'అమ్మఒడి' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ నటిస్తున్నారు. ఇందులో ఆయన ఉపాధ్యాయుడి పాత్రను పోషిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం షూటింగ్ పాడేరు మండలంలోని దిగుమోదాపుట్టు గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరుగుతోంది. చెట్టి ఫాల్గుణపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా పాల్గుణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకంపై సినిమా తీయడం సంతోషంగా ఉందని అన్నారు. మరోవైపు గతంలో ఫాల్గుణ ఉపాధ్యాయుడిగా, బ్యాంకర్ గా పని చేశారు.
Amma Odi
Film
YSRCP
MLA
Chetti Phalguna
Tollywood

More Telugu News