Arya: రాశి ఖన్నా 'అంతఃపురం' రిలీజ్ డేట్ ఫిక్స్!

Anatah Puram Movie Date Confirmed
  • తమిళంలో 'అరణ్మనై 3'
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ  
  • తెలుగు టైటిల్ గా 'అంతఃపురం'
  • ఈ నెల 31వ తేదీన విడుదల
తమిళంలో హారర్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో సుందర్.సి సిద్ధహస్తుడు. 'అరణ్మనై' టైటిల్ తో ఆయన నుంచి వరుస సినిమాలు వస్తున్నాయి. అలా వచ్చిన 'అరణ్మనై' .. 'అరణ్మనై 2' భారీ విజయాలను అందుకున్నాయి. తెలుగు అనువాదాలు వచ్చిన 'చంద్రకళ' .. 'కళావతి' కూడా ఇక్కడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఆ సినిమాలో సీక్వెల్ గా తమిళంలో 'అరణ్మనై 3' సినిమా రూపొందింది. ఆర్య - రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమాకి, 'అంతఃపురం' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ, ఈ నెల 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

ఉదయనిధి స్టాలిన్ నిర్మించిన ఈ సినిమాలో, సుందర్ తో పాటు ఖుష్బూ .. ఆండ్రియా .. సాక్షి అగర్వాల్ .. యోగిబాబు .. సంపత్ రాజ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. మొదటి రెండు భాగాల మాదిరిగానే ఈ సినిమా కూడా ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.
Arya
Rasi Khanna
Andrea
Anatah Puram Movie

More Telugu News