Balka Suman: కోల్ బ్లాకుల వేలాన్ని ఆపకపోతే బీజేపీ భరతం పడతాం: బాల్క సుమ‌న్

BJP should stop auction of Singareni coal blocks auction says Balka Suman

  • తెలంగాణకు అడుగడుగునా బీజేపీ అన్యాయం చేస్తోంది
  • ఇప్పటి వరకు రైతులను బీజేపీ ముంచింది
  • ఇప్పుడు సింగరేణి కార్మికులను ముంచేందుకు యత్నిస్తోంది

తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడుగడుగునా అన్యాయం చేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ముంచిన బీజేపీ... ఇప్పుడు సింగరేణి కార్మికులను ముంచేందుకు యత్నిస్తోందని అన్నారు. సింగరేణిలోని కోల్ బ్లాకులను వేలం వేయవద్దని మూడు రోజుల పాటు కార్మికులు సమ్మె చేసినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శించారు.

తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడని రాష్ట్ర బీజేపీ నేతలను ప్రజలు నిలదీయాలని అన్నారు. కోల్ బ్లాకుల వేలాన్ని ఆపాలని ప్రధాని మోదీతో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కోల్ బ్లాకుల వేలాన్ని ఆపకపోతే బీజేపీ భరతం పడతామని హెచ్చరించారు. బీజేపీ ధోరణిని తెలంగాణ ప్రజలంతా గమనించాలని అన్నారు.

Balka Suman
TRS
BJP
Kishan Reddy
Bandi Sanjay
Singareni
Coal Blocks
  • Loading...

More Telugu News