Allu Arjun: లైకా ప్రొడక్షన్స్ చేతికి 'పుష్ప' తమిళ వెర్షన్.. భారీ రేటుకి హక్కులు

Pushpa Tamil version bought by Lyca productions

  • సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' 
  • జంటగా అల్లు అర్జున్, రష్మిక  
  • ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యం
  • రూ.7 కోట్లకు కొన్న లైకా సంస్థ  

ఇప్పుడు తెలుగులో సెట్స్ మీదున్న భారీ బడ్జెట్టు సినిమాలలో 'పుష్ప' ఒకటి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో గ్లామరస్ హీరోయిన్ రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం కథ స్పాన్ ను బట్టి దీనిని రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. 'పుష్ప' తొలిభాగాన్ని డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. అలాగే, ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషల్లో కూడా అనువదించి రిలీజ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఈ చిత్రం తమిళ వెర్షన్ భారీ రేటుకి అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రం తమిళ థియేట్రికల్ హక్కులను రూ.7 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తాజా సమాచారం. ఇప్పటికే లైకా సంస్థ రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం తమిళ హక్కులను కూడా చేజిక్కించుకుంది. ఇప్పుడీ 'పుష్ప' తమిళ వెర్షన్ ను తమిళనాట భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కి తమిళనాట కూడా మంచి క్రేజ్ ఉండడంతో భారీ ఓపెనింగ్స్ వుంటాయని భావిస్తున్నారు.

ఇక ఈ 'పుష్ప' చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో.. అటవీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపిస్తాడు. పాత్ర స్వభావం రీత్యా ఇందులో హీరో బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడతాడు.

Allu Arjun
Rashmika Mandanna
Sukumar
Lyca Productions
  • Loading...

More Telugu News