Assom: లారీ డ్రైవర్ అతివేగం.. 10 మంది భక్తుల ప్రాణం తీసింది

10 Chhath Pooja Devotees Killed In Road Accident In Assom
  • అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం
  • చఠ్ పూజలు ముగించి ఆటోలో తిరుగు పయనమైన భక్తులు
  • ఆటోను ఎదురుగా ఢీకొట్టిన లారీ
  • ఆటోలో ఉన్న అందరూ దుర్మరణం
  • పారిపోయిన లారీ డ్రైవర్
వారంతా చఠ్ పూజ నిర్వహించి సంతోషంగా ఆటోలో ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. కానీ, ఎదురుగా ఓ లారీ అతివేగంగా మృత్యువు రూపంలో దూసుకొచ్చింది. వారి ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న మొత్తం 10 మంది భక్తులూ చనిపోయారు. 9 మంది స్పాట్ లోనే కన్నుమూయగా.. తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడిన మరో వ్యక్తి ఆసుపత్రిలో ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన అసోంలోని కరీంగంజ్ జిల్లా బైఠఖల్ లో జరిగింది.

చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, ముగ్గురు పురుషులు ఉన్నారని కరీంగంజ్ పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా నడిపాడని, అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రస్తుతం లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ప్రమాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. 10 మంది మృతికి కారణమైన లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు.
Assom
Road Accident
Crime News

More Telugu News