Amit Shah: హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు: అమిత్ షా

Amit Shah thanked Huzurabad people
  • హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల విక్టరీ
  • స్పందించిన అమిత్ షా
  • తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు బీజేపీ కట్టుబడి ఉందని వెల్లడి
  • తెలంగాణ బీజేపీ శ్రేణులకు అభినందనలు

హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘనవిజయం సాధించడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు అంటూ తెలుగులో ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తెలంగాణ ప్రజల శ్రేయస్సుకు బీజేపీ కట్టుబడి ఉందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలుపుకుంటున్నట్టు అమిత్ షా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News