Open Air Roof Top Theatre: ఇక కారులో కూర్చునే సినిమాను చూసేయచ్చు.. ముంబైలో అతిపెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ రెడీ!

Indias first open air rooftop drive in theatre to open from November 5
  • 17.5 ఎకరాల్లో విస్తరించిన జియో వరల్డ్ డ్రైవ్
  • 290 కార్ల సామర్థ్యం
  • దేశంలోనే తొలి ఓపెన్ ఎయిర్ రూఫ్ టాప్ థియేటర్
  • ఈ నెల 5న ప్రారంభం
ఇండియాలోనే తొలిసారి దేశంలో అతిపెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ ముంబైలో ప్రారంభం కాబోతోంది. రూఫ్-టాప్ థియేటర్ అయిన దీంట్లో కారులో కూర్చునే సినిమాను వీక్షించొచ్చని రిలయన్స్ రిటైల్ తెలిపింది. ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్ షాపింగ్ మాల్‌లో ఈ నెల 5న దీనిని ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. పీవీఆర్ సినిమాస్ ఈ సినిమా హాల్‌ను నిర్వహిస్తుంది. అతిపెద్ద స్క్రీన్ కలిగిన ఈ థియేటర్ 290 కార్ల సామర్థ్యం కలిగి ఉంది.  

వాణిజ్య రాజధాని అయిన ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 17.5 ఎకరాల విస్తీర్ణంలో జియో వరల్డ్ డ్రైవ్ ఉంది. ఇందులో దేశీయ, అంతర్జాతీయ ప్రీమియం బ్రాండ్లు మాత్రమే లభ్యమవుతాయి. ఈ సందర్భంగా రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ.. ఆధునిక వినియోగదారుల షాపింగ్‌ను మరింత అద్భుతమైన అనుభవంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం నుంచే జియో వరల్డ్ పుట్టుకొచ్చిందని చెప్పారు.
Open Air Roof Top Theatre
Reliance
Jio World Drive

More Telugu News