Violence: బంగ్లాదేశ్ లో మరింత ప్రజ్వరిల్లిన హింస... హిందువుల నివాసాలకు నిప్పు

  • బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న అల్లర్లు
  • దుర్గాపూజ సందర్భంగా మొదలైన హింసాకాండ
  • హింసకు దారితీసిన ఫేస్ బుక్ పోస్టు
  • ఓ గ్రామంపై దాడిచేసిన అల్లరిమూక
 Violence in Bangladesh continues

బంగ్లాదేశ్ లో దుర్గా మాత పూజ సందర్భంగా ప్రారంభమైన అల్లర్లు మరింత హింసాత్మకంగా పరిణమించాయి. ఈ మతపరమైన హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు ఆరుగురు మరణించారు. తాజాగా, 20 హిందువుల నివాసాలకు అల్లరిమూకలు నిప్పంటించాయి. 66 ఇళ్లను ధ్వసం చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఓ సోషల్ మీడియా పోస్టులో దుర్గామాత కాళ్ల వద్ద ఖురాన్ ఉండడం ఈ అల్లర్లకు కారణమని ప్రచారం జరుగుతోంది. రంగ్ పూర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఈ పోస్టును ఫేస్ బుక్ లో పెట్టినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడి ఉంటున్న గ్రామంపై 100 మంది అరాచకవాదులు దండెత్తి, ఇళ్లను ధ్వంసం చేసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

More Telugu News