Woman: కరోనా వ్యాక్సిన్ వేసేందుకు వచ్చిన సిబ్బంది... పాముతో కరిపిస్తానంటూ మహిళ బెదిరింపు

Woman threatens vaccination staff with snake

  • దేశంలో కరోనా వ్యాక్సినేషన్
  • రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఘటన
  • వ్యాక్సిన్ తీసుకునేందుకు మొండికేసిన మహిళ
  • బుట్టలో ఉన్న పామును బయటికి తీసిన వైనం

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అధికార యంత్రాంగం ముమ్మరంగా కృషి చేస్తోంది. అయితే, చాలా ప్రాంతాల్లో వ్యాక్సిన్లపై ప్రజల్లో అపోహలు నెలకొన్నాయి. దాంతో వ్యాక్సిన్లు వేయించుకునేందుకు ససేమిరా అంటున్నారు. రాజస్థాన్ లోని ఓ మహిళ ఏకంగా ఆరోగ్య సిబ్బందిపై పాముతో బెదిరింపులకు దిగింది.

అజ్మీర్ లో వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్న సిబ్బంది ఓ మహిళను టీకా తీసుకోవాలని కోరారు. అయితే ఆ మహిళ అందుకు నిరాకరిస్తూ, తనకు బలవంతంగా వ్యాక్సిన్ వేయాలని చూస్తే పాముతో కరిపిస్తానంటూ హెచ్చరించింది. అంతేకాదు, బుట్టలో ఉన్న పామును బయటికి తీసింది. దాంతో ఆరోగ్య సిబ్బంది మొదట భయపడినా, ఆ తర్వాత ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి మనసు మార్చారు. ఆమె ఒప్పుకోవడంతో అక్కడున్న వారందరికీ వ్యాక్సిన్లు వేశారు.

Woman
Snake
Vaccination
Health Staff
Ajmeer
Rajasthan
  • Loading...

More Telugu News