Ramdas Athawale: ఏపీకి మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదు: కేంద్రమంత్రి అథవాలే

Union minister Ramdas Athawale comments on three capitals for AP

  • కేంద్రమంత్రి అథవాలే కీలక వ్యాఖ్యలు
  • ఎన్డీయేలో వైసీపీ కూడా చేరాలని సూచన
  • ప్రాజెక్టులు, రహదారులు పూర్తిచేసుకోవచ్చని వెల్లడి
  • కేంద్రం భాగస్వామ్యంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని స్పష్టీకరణ

ఏపీకి మూడు రాజధానులు అంటూ వైసీపీ సర్కారు పేర్కొన్న నేపథ్యంలో విపక్షాలు ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుండడం తెలిసిందే. విభజనచట్టంలో ఒక రాజధాని అని మాత్రమే పేర్కొన్నారని విపక్షాలు ఎలుగెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదని స్పష్టం చేశారు.

అంతేకాదు, ఎన్డీయేలో వైసీపీ కూడా చేరాలని అన్నారు. కేంద్రం భాగస్వామ్యంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం అని స్పష్టం చేశారు. ప్రాజెక్టులు, రహదారులు పూర్తిచేసుకోవచ్చని ప్రతిపాదించారు. పరిశ్రమల ప్రైవేటీకరణ కాంగ్రెస్ హయాంలోనూ జరిగిందని అథవాలే పేర్కొన్నారు.

Ramdas Athawale
Three Capitals
Andhra Pradesh
NDA
YSRCP
  • Loading...

More Telugu News