Sherlyn Chopra: శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలపై షెర్లిన్ చోప్రా ఫిర్యాదు

Sherlyn Chopra files police complaint on Shilpa Shetty and Raj Kundra
  • రాజ్ కుంద్రా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు
  • శిల్పా శిట్టి, రాజ్ కుంద్రా నన్ను బెదిరించారు
  • రాజ్ కుంద్రాకు అండర్ వరల్డ్ తో సంబంధం ఉంది
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే, రాజ్ కుంద్రాతో పాటు శిల్పా శెట్టిపై సినీ నటి, మోడల్ షెర్లిన్ చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తనను మోసం చేయడమే కాకుండా, మానసిక క్షోభకు గురి చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్ కుంద్రా తనను లైంగిక వేధింపులకు కూడా గురి చేశారని తెలిపింది. తమకు వ్యతిరేకంగా ఏదైనా ప్రకటన చేస్తే పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కుంద్రా, శెట్టి తనను హెచ్చరించారని చెప్పారు.

రాజ్ కుంద్రాకు అండర్ వరల్డ్ తో సంబంధం ఉందని... వారి ద్వారా కూడా తనను బెదిరించారని అన్నారు. ఏప్రిల్ 19న రాజ్ కుంద్రా తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి కేసును ఉపసంహరించుకోవాలని బెదిరించాడని చెప్పారు. శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు.
Sherlyn Chopra
Shilpa Shetty
Raj Kundra
Bollywood

More Telugu News