Edible Oils: వంట నూనెలపై శుభవార్త చెప్పిన కేంద్రం

Govt decides to lift basic customs cess and reduce agri cess

  • పండుగ సీజన్ లో ప్రజలకు ఊరట
  • వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకం ఎత్తివేత
  • అదే సమయంలో అగ్రిసెస్ కూడా తగ్గింపు
  • తగ్గనున్న వంట నూనెల ధరలు

గత కొన్నాళ్లుగా వంట నూనెల ధరలు రాకెట్ లా దూసుకుపోతుండడంతో సగటు జీవి అల్లాడిపోతున్నాడు. దానికి తోడు ఇతర ధరలు కూడా పైపైకి ఎగబాకుతుండడంతో జేబుకు భారీగానే చిల్లు పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం శుభవార్త చెప్పింది. వంట నూనెలపై ఉన్న బేసిక్ కస్టమ్స్ సుంకం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. వంటనూనెలపై ఉన్న అగ్రిసెస్ ను కూడా తగ్గిస్తున్నట్టు తెలిపింది.

రిఫైన్డ్ వంటనూనెలపై బేసిక్ కస్టమ్స్ సుంకం ఇప్పటివరకు 32.5 శాతం ఉండగా, ఇప్పుడది 17.5 శాతానికి తగ్గింది. పామాయిల్ పై అగ్రిసెస్ 7.5 శాతానికి తగ్గగా, ముడి సోయాబీన్ నూనె, ముడి పొద్దుతిరుగుడు నూనెపై అగ్రిసెస్ 5.5 శాతానికి తగ్గింది. ఈ ఎత్తివేత, తగ్గింపులు అక్టోబరు 14 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగనున్నాయి. తదుపరి మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు.

ఈ రెండు చర్యల కారణంగా దేశంలో వంటనూనెల ధరలు బాగా తగ్గనున్నాయి. దసరా, దీపావళి సీజన్ లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రజలకు కాస్త ఊరట కలిగించనుంది.

Edible Oils
Prices
Basic Custom Cess
Agri Cess
India
  • Loading...

More Telugu News