Vangaveeti Mohana Ranga: ఆవేశం, ఆలోచన ఉన్న మన నాయకుడిని కాపాడుకుందాం: వంగవీటి రాధాకృష్ణ

Vangaveeti Radha krishna praises Ranga and Pawan Kalyan
  • ఒకప్పుడు మన నాయకుడు రంగాగారిని కాపాడుకోలేకపోయాం
  • కులం, మతంతో సంబంధం లేకుండా అందరినీ ఆదుకున్న నేత రంగా
  • పుట్టిన కులాన్ని తిట్టడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది
ఎప్పటికీ మన నాయకుడు వంగవీటి రంగాయేనని, తరతరాలకు ఆయనే మన నాయకుడని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మన నాయకుడు వంగవీటి రంగాను మనం ఒకప్పుడు కాపాడుకోలేకపోయామని, కానీ ఇప్పుడు ఆలోచన, ఆవేశం ఉన్న మన నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పుట్టిన కులాన్ని తిట్టడం ఇప్పుడు ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్ అయిపోయిందన్నారు.

కులాన్ని తిట్టడాన్ని చాలా గొప్పగా భావిస్తున్నారని మండిపడ్డారు. కలిసికట్టుగా పోరాడితే ప్రభుత్వాలనే కూల్చేయగల గొప్పదనం ఈ కులంలో ఉందని అన్నారు. కాబట్టి ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రంగా ఒక కులానికి ఆరాధ్య దైవమని అన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు కులం, మతం చూడకుండా ఆదుకోవడమే రంగాగారి గొప్పతనమని, అందుకనే ఆయనకు ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రజలు నీరాజనాలు పడుతున్నారని రాధాకృష్ణ అన్నారు.
Vangaveeti Mohana Ranga
Vangaveeti Radha Krishna
Pawan Kalyan
Janasena

More Telugu News