Mahatma Gandhi: మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్‌లో ప్రముఖుల నివాళి

president Ramnath Kovind PM Modi and Other leaders tributes Mahatma Gandhi

  • నేడు మహాత్మాగాంధీ 152వ జయంతి
  • మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి కూడా
  • ఇరువురు నేతలకు నివాళులర్పించిన ప్రముఖులు

మహాత్మాగాంధీ 152వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులు గాంధీ సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం కాసేపు మౌనం పాటించారు. అలాగే, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని విజయ్ ఘాట్ వద్ద ఆయన తనయుడు అనిల్ శాస్త్రి సహా నేతలందరూ నివాళులు అర్పించారు.

Mahatma Gandhi
Lal Bahadur Shastri
Birth Anniversary
Vijay Ghat
  • Loading...

More Telugu News