CJI NV Ramana: అధికార పార్టీల అండతో చెలరేగిపోయే పోలీసులకు న్యాయవ్యవస్థ రక్షణ కల్పించలేదు: సీజేఐ ఎన్వీ రమణ

CJI NV Ramana interesting comments
  • ఛత్తీస్ గఢ్ మాజీ ఏడీజీపీ కేసులో సీజేఐ వ్యాఖ్యలు
  • అధికార దుర్వినియోగానికి పాల్పడే అధికారులపై అసంతృప్తి
  • వారే న్యాయం కోసం కోర్టులకు వస్తున్నారని వెల్లడి
  • తగిన మూల్యం చెల్లిస్తారని వ్యాఖ్యలు
ఛత్తీస్ గఢ్ మాజీ ఏడీజీపీ గుర్జిందర్ పాల్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీల అండ చూసుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడే పోలీసులకు, అధికారులకు న్యాయవ్యవస్థ రక్షణ కల్పించలేదని పేర్కొన్నారు. అధికార పార్టీల అండతో వసూళ్లకు పాల్పడే అధికారులు వడ్డీతో సహా మూల్యం చెల్లించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చినప్పుడు సదరు అధికారులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించడం పరిపాటిగా మారిందని అన్నారు.

అంతేకాకుండా, అధికారులు హద్దులు మీరడం, పోలీసుల అతి ప్రవర్తనపై అందే ఫిర్యాదుల పరిష్కారానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నేతృత్వంలో స్థాయి సంఘం ఏర్పాటుకు యోచిస్తున్నట్టు సీజేఐ ఎన్వీ రమణ వెల్లడించారు. ప్రస్తుతానికి స్థాయి సంఘం ఏర్పాటుపై ఉత్తర్వులు జారీ చేయడంలేదని పేర్కొన్నారు. భవిష్యత్ లో మాత్రం పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
CJI NV Ramana
Police
Bureaucrats
Govt
Legal System

More Telugu News