Posani Krishna Murali: పవన్​ పై పోసాని వ్యాఖ్యలు.. నిహారిక స్పందన ఇదీ

Niharika Responds On Posani Comments On Pawan

  • పోసానిని మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని డిమాండ్
  • ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • పవన్ సైకో అని పోసాని కామెంట్లు

జనసేనాధిపతి పవన్ కల్యాణ్ మీద పోసాని కృష్ణమురళి వ్యాఖ్యల పట్ల నాగబాబు కుమార్తె నిహారిక మండిపడింది. ఆయనో మెంటల్ వ్యక్తి అని, వెంటనే మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

కాగా, నిన్న ప్రెస్ మీట్ లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై పోసాని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవిని టీడీపీ నేతలు తిడితే పవన్ కల్యాణ్ ఎటు పోయారని ప్రశ్నించారు. చిరంజీవి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వారు తిడితే.. తానే కౌంటర్ ఇచ్చానని గుర్తు చేశారు. అంతేగాకుండా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపైనా పోసాని మాట్లాడారు. పవన్, ఆయన అభిమానులు సైకోలని అన్నారు. దీంతో ఆయన ప్రెస్ మీట్ వద్దకు పవన్ అభిమానులు భారీగా చేరుకుని నిరసన తెలిపారు. ఇవాళ పోసానిపై కేసు పెట్టారు.

Posani Krishna Murali
Pawan Kalyan
Janasena
Niharika
Niharika Konidela
  • Loading...

More Telugu News