Cricket: నా భార్య చెన్నై జెర్సీ వేసుకోనివ్వలేదు.. ఐపీఎల్ వీరాభిమాని ఆవేదన!

IPL Fan Shows A poster That His wife not letting him to wear CSK Jersey
  • ఆర్సీబీ జెర్సీలో మ్యాచ్ కు హాజరు
  • పోస్టర్ ను ప్రదర్శించిన అభిమాని
  • ఆ ఫొటోను ట్వీట్ చేసిన సీఎస్కే
ఐపీఎల్ కు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ ఆటగాళ్లు బౌండరీలు బాదుతుంటే.. ప్రత్యర్థి టీం వికెట్లను పడగొడుతుంటే అభిమానుల కేరింతలు ఎలా ఉంటాయో స్టేడియాలే ప్రత్యక్ష సాక్షి. గత శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ అభిమాని ఇలాగే అందరి కంటా పడ్డాడు.

బెంగళూరు జెర్సీ వేసుకున్న ఆ అభిమాని.. ఓ పోస్టర్ ను ప్రదర్శించి అందరినీ ఆకర్షించాడు. ‘నా భార్య నన్ను చెన్నై జెర్సీ వేసుకోనివ్వలేదు’ అంటూ పేపర్ మీద రాసిన వాక్యాలను ప్రదర్శించాడు. ప్రేమకు రంగులేవి కనిపించవని పేర్కొంటూ ఆ ఫొటోను సీఎస్ కే ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

దీంతో నెటిజన్లు సరదా కామెంట్లు చేశారు. కొందరు సింపుల్ గా ఎమోజీలను పోస్ట్ చేస్తే.. మరికొందరు మాత్రం ఆర్సీబీ జెర్సీలో ఉన్న సీఎస్కే అభిమాని అంటూ ట్వీట్లు చేశారు. సీఎస్కే అందరి గుండెల్లో ఉందని, జెర్సీల్లో కాదని ఇంకొందరు కామెంట్ పెట్టారు. కాగా, ఆ మ్యాచ్ లో ఆర్సీబీపై చెన్నై గెలిచిన సంగతి తెలిసిందే.
Cricket
IPL
Chennai Super Kings
Royal Challengers Bangalore

More Telugu News