Anushka Shetty: అనుష్క పెళ్లి గురించి పండిట్ జగన్నాథ్ గురూజీ ఏం చెప్పారంటే..?

Anushka gets marriage befor 2023 says astrologist
  • అనుష్క జాతకాన్ని పండిట్ జగన్నాథ్ గురూజీకి చూపించిన అభిమానులు
  • ఇండస్ట్రీ బయటి వ్యక్తిని పెళ్లి చేసుకునే అవకాశం ఉందన్న గురూజీ
  • 2023లోగా పెళ్లవుతుందని జోస్యం
ప్రముఖ సినీ నటి అనుష్క శెట్టి పెళ్లి గురించి వచ్చినన్ని వార్తలు మరెవరి మీద వచ్చుండవేమో. పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో ఆమె ప్రేమలో ఉందని, ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్నేళ్లుగా ప్రచారం జరిగింది. తమది కేవలం స్నేహం మాత్రమేనని ఇద్దరూ చెప్పినప్పటికీ ఆ పుకార్లకు తెర పడలేదు. ఆ తర్వాత కూడా ఆమె వేరే వ్యక్తులను పెళ్లాడబోతున్నట్టు ప్రచారం జరిగింది. పెళ్లికి అనుష్క కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆమె జాతకాన్ని కొందరు అభిమానులు జ్యోతిష్యులకు చూపించారు. ఆమె జాతకాన్ని చూసిన ప్రముఖ పండిట్ జగన్నాథ్ గురూజీ కీలక విషయాలను తెలిపారు. ఆమె పెళ్లిపై వచ్చిన వార్తలు నిజం కాదని, అవన్నీ పుకార్లు మాత్రమేనని ఆయన చెప్పారు. వృత్తి విషయంలో అనుష్క ఎంతో సిన్సియర్ గా ఉంటుందని అన్నారు. ఆమె ముఖాన్ని బట్టి చూస్తే, ఒకే వృత్తిలో ఉన్న వారితో కలవడానికి ఆమె ఇష్టపడదని చెప్పారు. ఆమెలో అహంకారం కూడా ఉండదని తెలిపారు.

ఆమె కెరీర్ ఇంకా గొప్పగా ఉంటుందని తెలిపారు. సినీ పరిశ్రమలో ఉన్నంత కాలం ఆమె స్టార్ గానే ఉంటుందని చెప్పారు. ఇండస్ట్రీ బయటి వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అన్నారు. వచ్చే ఏడాది ఆమె పెళ్లి అవుతుందని... లేనిపక్షంలో 2023లోపు పెళ్లితంతు పూర్తవుతుందని చెప్పారు.
Anushka Shetty
Tollywood
Marriage
Astrology

More Telugu News