Raghu Babu: మా ఎన్నికలు: మంచు విష్ణు ప్యానెల్లో ప్రధాన కార్యదర్శిగా పోటీ చేస్తున్న రఘుబాబు

Raghu Babu in fray for general secretary post in MAA Elections

  • మా ఎలక్షన్ బరిలో రఘుబాబు
  • మంచు విష్ణు ప్యానెల్ నుంచి పోటీ
  • ఈసారి మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు వర్గాల మధ్య పోటీ
  • అక్టోబరు 10న మా ఎన్నికలు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. మంచు విష్ణు ప్యానెల్లో 'మా' ప్రధాన కార్యదర్శిగా నటుడు రఘుబాబు పోటీపడుతున్నట్టు వెల్లడైంది. 'మా' ఎన్నికల్లో ఈసారి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు వర్గాల మధ్య ప్రధానపోటీ నెలకొంది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ ను ప్రకటించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్లో 'మా' ప్రధాన కార్యదర్శిగా జీవిత పోటీపడుతుండడం తెలిసిందే.

ఇటీవల ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి వైదొలగిన నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కూడా ప్రధాన కార్యదర్శి పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 'మా' ఎన్నికలు అక్టోబరు 10న జరగనునున్నాయి.

Raghu Babu
General Secretary
MAA Elections
Manchu Vishnu
Prakash Raj
Tollywood
  • Loading...

More Telugu News