Virat Kohli: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. నాలుగో స్థానంలో కోహ్లీ

  • 6వ స్థానం నిలబెట్టుకున్న కేఎల్ రాహుల్
  • అగ్రస్థానంలో ఇంగ్లండ్ జట్టు
  • రెండో స్థానంలో నిలిచిన కోహ్లీ సేన
 Virat Kohli at 4th rank in ICC T20 rankings

టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా సారధి విరాట్ కోహ్లీ 4వ స్థానంలో నిలిచాడు. తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ తర్వాత మరో భారత ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా టాప్ టెన్‌లో చోటు నిలుపుకున్నాడు. రాహుల్ 6వ స్థానంలో కొనసాగుతున్నాడు.

శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో రాణించిన సౌతాఫ్రికా వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డీకాక్ తన కెరీర్‌లోనే అత్యుత్తమంగా 8వ స్థానాన్ని చేరుకున్నాడు. బౌలర్ల జాబితాలో ఎటువంటి మార్పులు జరగలేదు. అయితే టాప్ టెన్‌లో భారత బౌలర్లు ఎవరూ లేకపోవడం గమనార్హం. భువనేశ్వర్ కుమార్ మాత్రం 12వ స్థానంలో ఉన్నాడు.

ఆల్‌రౌండర్ల జాబితాలో ఆఫ్ఘన్ సారధి మహమ్మద్ నబీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో బంగ్లాదేశ్ స్టార్ షకిబ్ అల్ హసన్ ఉన్నాడు. ఇక జట్ల విషయానికొస్తే.. ఇంగ్లండ్ జట్టు అగ్రస్థానంలో ఉండగా.. భారత జట్టు రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో పాకిస్థాన్, నాలుగో స్థానంలో న్యూజిల్యాండ్, ఐదో స్థానంలో దక్షిణాఫ్రికా ఉన్నాయి.

More Telugu News