CM Jagan: బహ్రెయిన్ లో తెలుగువాళ్లను కాపాడండి... విదేశాంగ మంత్రి జైశంకర్ కు ఏపీ సీఎం జగన్ లేఖ

AP CM Jagan wrote Union external affairs minister Jai Shankar

  • బహ్రెయిన్ లో భారత కార్మికుల అగచాట్లు
  • యజమానుల చేతుల్లో వేధింపులు
  • బాధితుల్లో ఏపీ కార్మికులు
  • ఎలాంటి సహకారమైనా అందిస్తామన్న సీఎం జగన్
  • తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి వినతి

ఏపీ సీఎం జగన్ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కు లేఖ రాశారు. బహ్రెయిన్ లో అనేకమంది భారత కార్మికులు తమ యజమానుల చేతుల్లో వేధింపులకు గురవుతున్నారని వెల్లడించారు. తమ స్వస్థలాలకు తిరిగి వచ్చేందుకు వారు కేంద్ర ప్రభుత్వ సాయం కోరుతున్నారని తెలిపారు. బాధిత కార్మికుల్లో గణనీయమైన సంఖ్యలో ఏపీకి చెందినవారు ఉన్నారని సీఎం జగన్ కేంద్రమంత్రికి వివరించారు.

బహ్రెయిన్ నుంచి ఏపీ కార్మికులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు కేంద్రం చొరవచూపి తగిన చర్యలు తీసుకోవాలని, ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం తరఫున ఎలాంటి సహకారం అందించేందుకైనా సిద్ధంగా ఉన్నామని విజ్ఞప్తి చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ను, లేదా, ఏపీ సీఎంవో అధికారులను కూడా కలుపుకుని ముందుకు పోవాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా బహ్రెయిన్ లో అగచాట్లు పడుతున్న కార్మికులను స్వదేశానికి తీసుకురావాలని సీఎం జగన్ తన లేఖలో విన్నవించారు.

CM Jagan
Letter
S.Jai Shankar
Telugu Workers
Bahrain
Andhra Pradesh
India
  • Loading...

More Telugu News