Anantapur District: అనంతపురంలో విషాదం.. గణేశ్ మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి మరణించిన యువకుడు!

Young Boy died while dancing at Ganesh mandapam in Guthi anantapur dist
  • స్థానిక గౌతమిపురి కాలనీలో ఘటన
  • డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు
  • గుండెపోటు రావడంతో మృతి చెందాడన్న వైద్యులు
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. గణేశ్ మండపం వద్ద డ్యాన్స్ చేస్తున్న ఓ యువకుడు అకస్మాత్తుగా కుప్పకూలి మరణించాడు. గణేశ్ నవరాత్రులను పురస్కరించుకుని గుత్తిలోని స్థానిక గౌతమిపురి కాలనీలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఓ యువకుడు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతోనే అతడు మరణించాడని వైద్యులు తెలిపారు.
Anantapur District
Guthi
Vinayaka Chavithi

More Telugu News