Raja Singh: హిందువుల మనోభావాలను జగన్ గాయపరుస్తున్నారు: తెలంగాణ ఎమ్మెల్యే రాజాసింగ్

Jagan is damaging the feelings of Hindus says Raja Singh

  • వినాయకచవితిని ఇళ్లలోనే జరుపుకోవాలని ఆదేశించడం సరికాదు
  • వేడుకను జరుపుకోవడానికి భక్తులకు అనుమతిని ఇవ్వాలి
  • టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో పెద్ద తలకాయలు ఉన్నాయి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హిందువుల మనోభావాలను జగన్ కించపరుస్తున్నారని ఆయన మండిపడ్డారు. వినాయకచవితిని భక్తులు ఇళ్లలోనే జరుపుకోవాలని ఆదేశించడం సరికాదని చెప్పారు. కరోనా నిబంధనలతో గణేశ్ ఉత్సవాలను జరుపుకునేందుకు భక్తులకు అనుమతిని ఇవ్వాలని డిమాండ్ చేశారు.

టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో పెద్ద తలకాయలు ఉన్నాయని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ల్యాండ్, శాండ్, డ్రగ్స్ మాఫియాలు నడిపిస్తున్నాయని ఆరోపించారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి నాలుగు పార్టీలు మారే అలవాటు లేదని చెప్పారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లే అలవాటు బీజేపీకి లేదని... రూ. 50 కోట్లు ఇచ్చి పీసీసీ పదవిని తెచ్చుకున్నాడంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు.

Raja Singh
BJP
Jagan
Vinayaka Chavithi
YSRCP
Revanth Reddy
Congress
Tollywood
Drugs
  • Loading...

More Telugu News