America: అమెరికాలోని ఫ్లోరిడాలో దుండగుడి కాల్పులు.. నలుగురి మృతి

Florida gunman killed 4
  • ఫ్లోరిడాలోని లేక్‌ల్యాండ్‌లో ఘటన
  • జనంపై రెండు రౌండ్ల కాల్పులు
  • మృతుల్లో బాలింత, బాలిక కూడా..
అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ దుండగుడు కాల్పులతో జనాన్ని భయభ్రాంతులకు గురిచేశాడు. లేక్ ల్యాండ్‌లో ఒక్కసారిగా తుపాకి గురిపెట్టి కనిపించిన వారిపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో జనం భీతావహులై పరుగులు తీశారు. ఏం జరుగుతోందో అర్థం కాక కేకలు వేశారు. దుండగుడి కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. వీరిలో బాలింత, మగశిశువు, బాలికతోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడికి మతిస్థిమితం లేదని నిర్ధారించారు.
America
Florida
Gunman
Firing

More Telugu News