Somu Veerraju: కర్నూలులో కలెక్టర్ నివాసం ముట్టడి... సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి అరెస్ట్!

Kurnool police arrests BJP leaders

  • వినాయకచవితి ఇళ్లలోనే జరుపుకోవాలన్న ప్రభుత్వం
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ
  • ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్
  • కర్నూలులో ఆందోళన

ఏపీలో వినాయకచవితి వేడుకలను ప్రజలు ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేయడం పట్ల బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిల నేతృత్వంలో బీజేపీ శ్రేణులు నేడు కర్నూలులో ఆందోళన చేపట్టాయి. వినాయకచవితి వేడుకలపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ బీజేపీ నేతలు, కార్యకర్తలు కలెక్టర్ నివాసాన్ని ముట్టడించారు.

దాంతో పోలీసులు బీజేపీ అగ్రనేతలు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. పోలీసులు బీజేపీ నేతలను తరలించే సమయంలో ఆ పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఓ దశలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Somu Veerraju
Vishnu Vardhan Reddy
Kurnool
Vinayaka Chavithi
BJP
  • Loading...

More Telugu News