Telangana: ప్రయాణికులకు శుభవార్త.. వేళలను పెంచిన మెట్రో

Hyderabad Metro Increases Service Timings
  • అదనంగా అరగంట నడవనున్న రైళ్లు
  • రాత్రి 10.15 గంటలకు చివరి ట్రైన్
  • ఉదయం 7 గంటలకు ఫస్ట్ ట్రైన్

కరోనా కారణంగా ఇన్నాళ్లూ మెట్రో సేవలను హైదరాబాద్ మెట్రో రైల్ కుదించింది. రాత్రి 9.45 గంటల వరకే ఇప్పటిదాకా సేవలందించింది. అయితే, ఇప్పుడు ప్రయాణికులకు మెట్రో రైల్ ఓ శుభవార్త చెప్పింది. మెట్రో పనివేళలను పెంచుతున్నట్టు ప్రకటించింది.

రేపట్నుంచి రాత్రి 10.15 గంటల వరకు మెట్రోను నడుపుతున్నామని వెల్లడించింది. ఇది వరకున్న సమయానికి అరగంట అదనంగా రైళ్లను నడుపుతామని తెలిపింది. చివరి రైలు 10.15 గంటలకు మొదలవుతుందని, రాత్రి 11.15 గంటలకు స్టేషన్ కు చేరుతుందని పేర్కొంది. ఎప్పట్లాగే ఉదయం 7 గంటకే మొదటి రైలు మొదలవుతుందని మెట్రో ప్రకటించింది.

  • Loading...

More Telugu News