TTD: తిరుమలలో సంప్రదాయ భోజనం నిలిపివేత!

Sampradaya Bhojanam halted in Tirumala immediate affect

  • సంప్రదాయ భోజనంపై తొలుత ప్రశంసలు
  • డబ్బులు వసూలు చేస్తుండడంపై విమర్శలు
  • పాలకమండలి లేనప్పుడే నిర్ణయం తీసుకున్నారన్న వైవీ

తిరుమలలో ఇటీవల ప్రవేశపెట్టిన సంప్రదాయ భోజనాన్ని తక్షణం నిలిపివేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. సంప్రదాయ భోజనంపై ప్రశంసలు కురిసినప్పటికీ, డబ్బులు తీసుకోవాలని నిర్ణయించడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. దీంతో స్పందించిన వైవీ సుబ్బారెడ్డి సంప్రదాయ భోజనాన్ని తక్షణం నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయమై అధికారులతో చర్చించినట్టు పేర్కొన్నారు. పాలకమండలి లేనప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. స్వామి వారి ప్రసాదంగానే  భోజనం అందించాలని, డబ్బులు వసూలు చేయకూడదని నిర్ణయించామని వైవీ తెలిపారు. 

TTD
Tirumala
Tirupati
Sampradya Bhojanam
YV Subba Reddy
  • Loading...

More Telugu News