Taliban: తాలిబన్ల మరో కిరాతకం.. జానపద గాయకుడి హత్య

Taliban kill Afghan folk singer with whom they had tea before

  • ప్రముఖ జానపద గాయకుడు ఫవాద్‌ను కాల్చి చంపిన తాలిబన్లు
  • తిరుగుబాటు దళాల పనేనన్న తాలిబన్లు
  • హంతకులను గుర్తించి శిక్షిస్తామని హామీ

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. వ్యతిరేకులను యథేచ్ఛగా హత్య చేస్తున్న తాలిబన్లు తాజాగా ప్రముఖ జానపద గాయకుడు ఫవాద్ అంరాబీని దారుణంగా హతమార్చారు. బగ్లాన్ ప్రావిన్స్‌లో నిన్న ఆయనను కాల్చి చంపారు. ఈ ప్రాంతంలో తాలిబన్ వ్యతిరేక దళాలకు గట్టి పట్టుంది. కొన్ని ప్రాంతాలు వారి అధీనంలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

తాలిబన్లు తన తండ్రిని కాల్చి చంపారని ఆయన కుమారుడు జవాద్ అందరాబీ తెలిపారు. తాలిబన్లు తమ ఇంటికి రావడం ఇదే తొలిసారి కాదని, గతంలోనూ ఓసారి వచ్చి ఇంట్లో తనిఖీలు చేశారని పేర్కొన్నారు. అంతేకాదు, ఇంట్లో తన తండ్రితో కలిసి టీ కూడా తాగారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడేమైందో తెలియదని, తన తండ్రిని కాల్చి చంపారని జవాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు, ఫవాద్‌ను హత్య చేసింది తాము కాదని, తిరుగుబాటుదారులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని తాలిబన్లు చెబుతున్నారు. తండ్రి హత్యపై న్యాయం కోరుతూ స్థానిక తాలిబన్ కౌన్సిల్‌ను ఆశ్రయించగా .. ఫవాద్ హంతకులను గుర్తించి శిక్షిస్తామని హామీ ఇచ్చినట్టు జవాద్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు జరిపించి కారకులైన తిరుగుబాటుదారులను శిక్షిస్తామని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ హామీ ఇచ్చారని జవాద్ తెలిపారు.

Taliban
Afghanistan
Folk Singer
Fawad Andarabi
  • Loading...

More Telugu News